Navigation

agencies_default_page

పూర్వవర్తి అధికార పత్రం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాష్ట్ర మరియు ఆచార కార్యక్రమాలలో అనుసరిస్తున్న పూర్వవర్తి అధికార పత్రం / పూర్వత్రాక్రమం క్రింది విధంగా ఉంది. (జి.ఓ.ఎం.ఎస్.నం.59, సాధారణ పరిపాలన (ప్రోటోకాల్.ఎ)శాఖ, తేది.11-4-2018).

అధికార పత్రం నిబంధన

పదవి పేరు

1

భారత రాష్ట్రపతి

2

భారత ఉప-రాష్ట్రపతి

3

భారత ప్రధానమంత్రి

4

ఆంధ్రప్రదేశ్ గవర్నరు

5

మాజీ భారత రాష్ట్రపతులు

5ఎ

భారత ఉప-ప్రధానమంత్రి

6

భారత ప్రధాన న్యాయమూర్తి / లోక్ సభ సభాపతి

7

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి / కేంద్ర కేబినెట్ మంత్రులు / ఉపాధ్యక్షుడు, నీతి ఆయోగ్ / మాజీ భారత ప్రధానమంత్రులు / రాజ్యసభ మరియు లోక్ సభ ప్రతిపక్ష నాయకులు

7ఎ

భారత రత్న అవార్డు గ్రహీత

8

భారత దేశానికి నియమించబడిన కామన్ వెల్త్ దేశాల అసాధారణ మరియు అధికార రాయబారులు మరియు హై కమీషనరు / ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి / ఇతర రాష్ట్రాల గవర్నరు

9

భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తులు

9ఎ

ప్రధాన ఎన్నికల కమీషనరు / అధ్యక్షుడు, యు.పి.ఎస్.సి / భారత కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్

10

ఆంధ్రప్రదేశ్ ఉప-ముఖ్యమంత్రి / రాజ్యసభ ఉపాధ్యక్షుడు / లోక్ సభ ఉప-సభాపతి / కేంద్ర సహాయ మంత్రులు / నీతి ఆయోగ్ సభ్యులు

11

క్యాబినెట్ కార్యదర్శి / యు.పి.ఎస్.సి. సభ్యులు.

12

పూర్తి సాధారణ లేదా సమాన ర్యాంకు గల సిబ్బంది ప్రధాన అధికారి

13

భారతదేశానికి నియమించబడిన అసాధారణ రాయబారులు మరియు సర్వాధికార మంత్రులు

14

అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్తు / ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి / ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి / ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త / ఏ.పి.ఎల్.సి, ప్రతిపక్ష నాయకుడు / ఏ.పి.ఎల్.ఏ ప్రతిపక్ష నాయకుడు.

15

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులు / ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికా మండలి / ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్లు / ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు / భారత రిజర్వు బ్యాంకు గవర్నరు / కేంద్ర ఉప-మంత్రులు

16

లెఫ్ట్ నెంట్ జనరల్ లేదా సమాన ర్యాంకుతో పనిచేస్తున్న రాష్ట్ర ప్రధానాధికార్లు

17

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు / ఛైర్మన్, ఏ.పి.పి.ఎస్.సి / ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ / అధ్యక్షుడు, ఏ.పి.ఎస్.హెచ్.ఆర్.సి. / ఛైర్మన్, ఏ.పి.ఏ.టి / ఆంధ్రప్రదేశ్ ఉప-లోకాయుక్త / ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ / ఛైర్మన్, ఎస్.సి. & ఎస్.టి. కమీషన్ / ఛైర్మన్, బిసి కమీషన్ / ఛైర్ పర్సన్, మహిళా కమీషన్ / ఛైర్మన్, మైనారిటీల కమీషన్ / ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ వినియోగదారు వివాదాల పరిష్కార కమీషన్ / ఛైర్ పర్సన్, ఫుడ్ కమీషన్ / క్యాబినెట్ హోదా గల ఆంధ్రప్రదేశ్ లోని స్వయం ప్రతిపత్తి సంస్థల ఛైర్ పర్సన్లు / ఇతర రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు / ఇతర రాష్ట్రాల హైకోర్టుల దిగువ స్థాయి న్యాయమూర్తులు

17ఎ

రాష్ట్ర ముఖ్య సమాచార కమీషనరు

18

ఆంధ్రప్రదేశ్ సహాయ మంత్రి / ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్తు ఉపాధ్యక్షుడు / ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప-సభాపతి / ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్తు చీఫ్ విప్ / ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్ / జిల్లా పరిషత్తుల అధికార పరిధిలోగల ఛైర్ పర్సన్లు / సంబంధిత అధికార పరిధిలోగల మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లు / ఇతర రాష్ట్రాల సహాయ మంత్రులు / ఇతర రాష్ట్రాల శాసన మండలి అధ్యక్షుడు / సభాపతి. 

19

ప్రభుత్వ విప్ లు, ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్తు / ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రభుత్వ విప్ లు / ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప మంత్రులు.

20

వారి సంబంధిత అధికార పరిధికి వెలుపల ఉన్న జిల్లా పరిషత్తుల ఛైర్ పర్సన్లు మరియు మునిసిపలు కార్పొరేషన్ల మేయర్లు / వారి సంబంధిత రాష్ట్రాల వెలుపల ఉన్న రాష్ట్ర శాసన మండళ్ల ఉపాధ్యక్షుడు / ఉప-సభాపతి / ఇతర రాష్ట్రాల సహాయ మంత్రులు.

21

పార్లెమెంటు సభ్యులు / ఏ.పి.ఎల్.సి. సభ్యులు / ఏ.పి.ఎల్.ఏ. సభ్యులు

22

ఇతర రాష్ట్రాల ఉప సహాయ మంత్రులు

23

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి / ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు / కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు (పదవిరీత్యా ఈ కార్యాలయంలో అధికారుల హోదాను కలిగివున్న అధికారులతో సహా) / క్యాబినెట్ హోదాలేని ఆంధ్రప్రదేశ్ లోని ఛైర్ పర్సన్లు మరియు సలహాదారులు / ఏ.పి.ఏ.టి. వైస్ –ఛైర్మన్ / ఏ.పి.ఇ.ఆర్.సి. సభ్యులు / ఏ.పి.ఎస్.హెచ్.ఆర్.సి. సభ్యులు / ఎస్.సి. &ఎస్.టి. కమీషను సభ్యులు / బి.సి కమీషన్ సభ్యులు / మైనారిటీల కమీషన్ సభ్యులు / ఫుడ్ కమీషన్ సభ్యులు / స్వయంపాలక సంస్థల సభ్యులు / మైనారిటీల కమీషను కార్యదర్శి / ఎస్.సి. &ఎస్.టి. కమీషను కార్యదర్శి.

23A

రాష్ట్ర సమాచార కమీషనరు

24

ఏ.పి.ఏ.టి. సభ్యులు / పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు / ఫాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, తూర్పు నావల్ కమాండ్ / లెఫ్ట్ నెంట్ జనరల్ లేదా తత్సమాన హోదాగల అధికారులు

25

భూ పరిపాలన ప్రధాన కమీషనరు / ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు / పోలీసు డైరెక్టరు జనరల్ / అటవీ ప్రధాన ముఖ్య సంరక్షకుడు / ఉప కులపతులు/  ఏ.పి.పి.ఎస్.సి. సభ్యులు / కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శులు / అదనపు సొలిసిటర్ జనరల్ / ఆంధ్రప్రదేశ్ అడ్వకేటు జనరలు / ఛార్జ్ వ్యవహారాలు మరియు యాక్టింగ్ హై కమీషనర్లు ఎపీడ్ అండ్ అడింటెరిమ్ / ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు.

26

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శులు / ఆంధ్రప్రదేశ్ అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ / ఆంధ్రప్రదేశ్ లో అడవుల ప్రధాన సంరక్షకుడు / ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రారు / షార్ డైరెక్టరు, శ్రీహరికోట / కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శులు, తత్సమాన హోదాగల అధికారులు / మేజర్ జనరల్ ర్యాంకు లేదా తత్సమాన ర్యాంకు గల అధికారులు

27

వారి అధికార పరిధిలో గల జిల్లాల కలెక్టర్లు / వారి అధికార పరిధిలో గల జిల్లా మరియు సెషన్సు న్యాయాధికారులు / సెలెక్షన్ గ్రేడులోని ఆంధ్రప్రదేశ్ భారతీయ పరిపాలక సేవా అధికారులు / ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవులతో సమానంగా ప్రకటించిన పదవులను కలిగివున్న ఆంధ్రప్రదేశ్ భారతీయ పోలీసు సేవా అధికారులు / అడవుల ప్రధాన సంరక్షకులతో సమానంగా ప్రకటించిన పోస్టులను నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ అటవీ సేవా అధికారులు / ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త, ఉప-లోకాయుక్త సంస్థ రిజిస్ట్రారు / ఆంధ్రప్రదేశ్ అకౌంటెంటు జనరలు / ఆదాయ పన్ను కమీషనరు / ఆంధ్రప్రదేశ్ టెలి కమ్యూనికేషన్ల జనరల్ మేనేజరు.

28

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు లేదా అదనపు కార్యదర్శులు / ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ / అడవుల అదనపు ప్రధాన సంరక్షకుడు మరియు తత్సమాన హోదాగా ప్రకటించిన పదవులను నిర్వహిస్తున్న అధికారులు / పోలీసు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరలు / తత్సమాన హోదాగా ప్రకటించిన పదవులను నిర్వహిస్తున్న అధికారులు / ఆంధ్రప్రదేశ్ ప్రాధమిక నియమావళిలోని శాఖాధిపతులు / జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడులో ఆంధ్రప్రదేశ్ భారతీయ పరిపాలక సేవా అధికారులు / సిటీ సివిల్ కోర్టు అడిషనల్ చీఫ్ జడ్జి / స్వల్ప కారణాల వివాదాల పరిష్కార కోర్టు, చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేటు మరియు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి / జిల్లా సెషన్సు జడ్జిలు (గ్రేడు – I & II ) ప్రిసైడింగు అధికారి, రాష్ట్ర రవాణా అప్పిలేటు ట్రిబ్యునలు / ఏ.పి.ఏ.టి రిజిస్ట్రారు. 

29

సీనియర్ టైం స్కేలులో భారతీయ పరిపాలక సేవా అధికారులు / సెలక్షన్ గ్రేడులో భారతీయ పోలీసు  సేవా అధికారులు మరియు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ / తమ అధికార పరిధిలోని పోలీసు సూపరింటెండెంట్లు / ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంయుక్త కార్యదర్శులు మరియు తత్సమాన హోదాగల శాఖాధిపతుల కార్యాలయాల అధికారులు & రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల సబార్డినేటు / ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్ / ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల సూపరింటెండెంటు.

30

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉప కార్యదర్శులు, తత్సమాన హోదాగల శాఖాధిపతుల కార్యాలయాల అధికారులు & రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల సబార్డినేటు.

31

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ కార్యదర్శులు మరియు తత్సమాన హోదాగల శాఖాధిపతుల కార్యాలయాల అధికారులు & సబార్డినేటు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు.

వివరణలు

 

వివరణ- 1

ఈ పూర్వవర్తి అధికార పత్రంలోని క్రమం, రాష్ట్ర ఉత్సవ సంబంధిత సందర్భాలకు ఉద్దేశించడమయింది. ప్రభుత్వ దైనందిన వ్యవహారాలకు వర్తించదు.  

వివరణ - 2

పరిచ్ఛేదాలలోని సంఖ్యా క్రమంలో ఈ పూర్వవర్తి అధికార పత్రంలోని వ్యక్తులు హోదా కలిగివుంటారు. ఒకే పరిచ్ఛేదంలోని నమోదులు రెండు విభాగాలుగా ఏర్పాటు చేయడమయింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యక్తులు, తర్వాత కేంద్ర ప్రభుత్వ వ్యక్తిగా ఉంటారు. ఒకే పరిచ్ఛేదంలో చేర్చబడిన వారు, ఆ పరిచ్ఛేదంలో నమోదు చేసిన తేదీ ప్రకారం పరస్పరం అగ్రస్థానం కలిగివుంటారు. అయితే, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులు ఒకే పరిచ్ఛేదంలో చేర్చబడి వారి రాష్ట్రాలు, లేదా కేంద్రపాలిత ప్రాంతాల వెలుపల వేడుకకు హాజరయితే, వారి నమోదు తేదీలను నిర్ధారించడంలో ఇబ్బంది ఉంటుంది కనుక, ఆ పరిచ్ఛేదంలో నమోదు తేదీ ప్రకారం నిర్ణయించిన విధంగా వారికి అగ్రస్థానం కేటాయించనగును.

వివరణ – 3

పూర్వవర్తి అధికార పత్రంలో పేర్కొన్న పదవిలో మహిళ ఉన్న సందర్భంలో మినహా ఇతర మహిళలందరూ వారి భర్తలతోపాటు వారి సంబంధిత పూర్వవర్తి అధికార పత్రంలోని వారి స్థానాలలో కూర్చోవడమవుతుంది.

వివరణ – 4

7వ పరిచ్ఛేదంలో :

రాష్ట్రంలో నిర్వహించే అధికారిక వేడుకలలో ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులపై అగ్రస్థానం కలిగివుంటారు.

వివరణ – 5

8వ పరిచ్ఛేదంలో :

ఎ)  భారతదేశానికి నియమించబడిన కామన్ వెల్త్ దేశాల అసాధారణ మరియు అసాధారణ అధికార రాయబారులు, వారి సంబంధిత రాష్ట్రాల వెలుపల రాష్ట్రాల గవర్నర్ ల కంటే పై హోదాను మూకుమ్మడిగా కలిగివుంటారు.

బి)  వారి సంబంధిత రాష్ట్రాల వెలుపల రాష్ట్ర గవర్నర్లు, వారి రాష్ట్రాల వెలుపల రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే పై హోదాను మూకుమ్మడిగా కలిగివుంటారు.  

వివరణ – 6

భారత్ కు వారి సందర్శన సమయంలో విదేశీ ఉన్నతాధికారులకు, భారత రాయబారులకు, హై కమీషనర్లకు, సంపూర్ణాధికారాలు గల మంత్రులకు విదేశీ వ్యవహారాల శాఖ సముచిత హోదాను కేటాయిస్తుంది.

వివరణ – 7

2వ వివరణలో నిర్ధిష్టపరచిన కార్యవిధానం ఉన్నప్పటికీ, 10వ పరిచ్ఛేదంలోని వ్యక్తుల పరస్పర హోదాలు, పూర్వవర్తనను ఈ క్రింది క్రమంలో కేటాయించాలి :

1)    రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్,

2)    లోక్ సభ ఉప - సభాపతి.  

3)   రక్షణ దళ అంశాల కోసం రక్షణ మంత్రిత్వ శాఖలోని కేంద్ర సహాయ మంత్రులు    

      మరియు ఎవరేని ఇతర మంత్రి.

4)    ఆంధ్రప్రదేశ్ ఉప-ముఖ్యమంత్రులు

5)   ‘నీతి’ ఆయోగ్ సభ్యులు

వివరణ – 8

14వ పరిచ్ఛేదంలో :

ఎ)   రాష్ట్ర శాసనపరిషత్తు ఛైర్మన్లు సభాపతి కంటే పై హోదాలో ఉంటారు. మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త కంటే అగ్రస్థానంలో ఉంటారు.

బి)   ఛైర్మన్, స్పీకర్ మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి రాజ్యాంగపరమైన నియుక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త కంటే అగ్రస్థానంలో ఉంటారు.

మరియు

సి)   ఆ పరిచ్ఛేదంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ప్రతిపక్ష నేత మిగిలిన అందరికంటే అగ్రస్థానంలో ఉంటారు. 

వివరణ – 9

18వ పరిచ్ఛేదంలో :

ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్ ఈ పరిచ్ఛేదంలో రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర మంత్రుల కన్నా తక్కువ ప్రాధాన్యతను ఇవ్వడమవుతుంది.

వివరణ - 10

19వ పరిచ్ఛేదంలో :

ఆ పరిచ్ఛేదంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రభుత్వ విప్ లకు డిప్యూటీ మంత్రుల కంటే ప్రాధాన్యతను ఇవ్వడమవుతుంది.

వివరణ - 11

21వ పరిచ్ఛేదంలో : 

శాసనసభ సభ్యులు క్రింది వరుస క్రమంలో ఆహ్వానించబడతారు :

ఎ)  రాజ్యసభ సభ్యులు.

బి)  లోక్ సభ సభ్యులు.

సి)  శాసనపరిషత్తు సభ్యులు.

డి)  శాసనసభ సభ్యులు.

అయితే, ప్రతి సభలోని ఈ క్రింది సభ్యులు ఆ సభలోని ఇతర వ్యక్తుల కంటే అగ్రస్థానం వహిస్తారు.

ఎ)  ప్రతిపక్ష పార్టీల సభా నాయకులు.

బి)  మాజీ – మంత్రులు, ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్తు / ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని అతిపెద్ద  

ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఇతర అందరు సభ్యుల కంటే అగ్రస్థానం వహిస్తారు.

వివరణ - 12

23వ పరిచ్ఛేదంలో :

ఎ)  భారత విదేశాంగ శాఖ గ్రేడ్ – I లోని  వారి సీనియారిటీ క్రమంలో విదేశాంగ కార్యదర్శి కాకుండా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కార్యదర్శులు తమ మధ్య అగ్రస్థానం వహిస్తారు మరియు విదేశీ కార్యదర్శి తరువాత వారిద్దరూ అగ్రస్థానం వహిస్తారు.

బి)  మైనారిటీల కమీషన్ సభ్యులు మరియు షెడ్యూల్డు కులాలు మరియు షెడ్యూల్డు తెగల కమీషన్ సభ్యులు ఈ కమీషన్ల కార్యదర్శులపై ఎల్లప్పుడూ అగ్రస్థానం వహిస్తారు.

వివరణ - 13

24వ పరిచ్ఛేదంలో :

ఆ పరిచ్ఛేదంలో, ఆంధ్రప్రదేశ్ పరిపాలక ట్రిబ్యునల్ సభ్యులు పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై అగ్రస్థానం వహిస్తారు.

వివరణ - 14

25వ పరిచ్ఛేదంలో :

ఎ)  భారత విదేశాంగ శాఖ సర్వీసు లోని గ్రేడ్ - II లో  వారి సీనియారిటీ క్రమంలో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శులు వారిలో వారు అగ్రస్థానం వహిస్తారు.

బి)  అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పై అగ్రస్థానం వహిస్తారు.

 

వార్షిక సంఘటనల జాబితా


వార్షిక సంఘటనల జాబితా

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.ఎంఎస్.నెం.21 సాధారణ పరిపాలన (ప్రోటోకాల్.బి ) శాఖ, తేది : 14 -02-2019 లో ఇవ్వబడిన ఉతర్వులు ఆధారంగా ఈ క్రింది  జయంతి ఉత్సవాలు/ వర్ధంతి ఉత్సవాలు రాష్ట్ర వేడుకలు గా నిర్వహించబడును.

 

జయంతి ఉత్సవాలు :

  1. శ్రీ బళ్ళారి రాఘవ (తాడిపత్రి రాఘవాచార్యులు ) : ప్రతి సంవత్సరం జనన తేదీ అయిన ఆగష్టు 2న.
  2. త్రిపురనేని రామస్వామి చౌదరి : ప్రతి సంవత్సరం జనన తేదీ అయిన జనవరి 15న.
  3. పుట్టపర్తి నారాయణాచార్యులు : ప్రతి సంవత్సరం జనన తేదీ అయిన మార్చి 28న.

వర్ధంతి ఉత్సవాలు :

  1. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి : ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, 22న వర్ధంతి.
  2. అల్లూరి సీతారామరాజు : ప్రతి సంవత్సరం మే, 7న వర్ధంతి
  3. శ్రీ పొట్టి శ్రీరాములు : ప్రతి సంవత్సరం డిసెంబరు, 15న వర్ధంతి.

సంకేత బుగ్గలు మరియు శబ్ధం చేసే పరికరాలు  


జి.ఓ.ఆర్.టి.నెం. 1077, ప్రధాన పరిపాలన (పొలిటికల్.బి) శాఖ, తేదీః 15-05-2017.

 

ప్రోటోకాల్ డైరెక్టరు


ప్రోటోకాల్ డైరెక్టర్ జి.ఏ.డి. పరిధిలో శాఖాధిపతిగా ఉంటారు. ఈ శాఖ విజయవాడ, హైదరాబాదులోని (మంజీర, హరిత ప్లాజా) ప్రభుత్వ అతిధి గృహాలను నిర్వహిస్తున్నది. రాష్ట్ర ఈవెంట్లను నిర్వహిస్తున్నది. (స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, నవ నిర్మాణ దీక్ష మొదలైనటువంటి) తేనీటి విందు (క్రిస్మస్ ఈన్, ఇఫ్తార్ మొదలైనవి) మరియు రాష్ట్ర విందులను ముఖ్యమంత్రిగారు ఆతిథ్యం వహిస్తారు. ఈ శాఖ రాష్ట్ర అతిథులకు స్వాగతం పలుకుతున్నది.

 

ఆంధ్రప్రదేశ్ భవన్, కొత్త ఢిల్లీ


నెం.1, అశోక రోడ్డులో ఉంది. ఈ భవనానికి రెసిడెంట్ కమీషనరు అధిపతిగా ఉన్నారు. రాష్ట్రం నుండి  వెళుతున్న మంత్రులు మరియు అధికారులకు వసతి కల్పిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల మధ్య ఇది ఒక అనుసంధాన కార్యాలయంగా కూడా వ్యవహరిస్తున్నది. ఏ.పి. భవన్ లోని అధికారిక మరియు రుచికరమైన ఆంధ్రా వంటలను అందిస్తున్న రెస్టారెంటు కొత్త ఢిల్లీలోని నివాసితులలో కూడా బాగా ప్రజాదరణ పొందింది. ఈ ప్రదేశంలో తెలుగు సాంస్కృతిక ఈవెంట్లను క్రమంతప్పకుండా నిర్వహించబడుతున్న ఒక ఆడిటోరియం కూడా ఉంది.