Navigation

personnel_general_default_page

 

మెడికల్ రీయింబర్స్ మెంట్


ప్రభుత్వం, అఖిల భారత సర్వీసు  అధికారులకు వైద్య ఖర్చులను తిరిగి చెల్లించడంపై జారీచేసిన ఉత్తరువులన్నింటినీ రద్దు చేసి 19-12-2017 తేదీగల సాధారణ పరిపాలన (ఎస్.సి-ఇ) శాఖ జిఓఎంఎస్.నెం.189 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎఐఎస్ వైద్య పరిచర్య నిబంధనావళిని జారీచేసింది. జిఓఎంఎస్.సం.189, జిఎ(ఎస్.సి-ఇ) శాఖ,  తేది19-12-2017.

    • వివిధ చికిత్సలకు సంబంధించి ఎటువంటి గరిష్ట పరిమితులు లేవు.

    • నేత్ర మరియు దంత సంబంధ చికిత్సలు చేర్చడమయింది.

    • అఖిల భారత సర్వీసు అధికారులు, పింఛనుదారులు మరియు వారి కుటుంబ సభ్యులు అర్హతకలిగి ఉంటారు.

    • రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఎటువంటి ముందస్తు రిఫరల్ అవసరం లేదు.

    ప్రభుత్వం 20-03-2018 తేదీగల ప్రధాన పరిపాలన (ఎస్.సి-ఇ) శాఖ జి.ఓ.ఎంఎస్.నెం.49లో రాష్ట్రం వెలుపల ఉన్న ఈ క్రింది ఆసుపత్రులలో రీయింబర్స్ మెంట్ కోసం ఉత్తరువులు జారీచేసింది. అవి : (i) రామ్ మనోహర్ లోహియా, ఢిల్లీ, (ii) మదాంత, ఢిల్లీ, (iii) ఇంద్రప్రస్థ, ఢిల్లీ, (iv) అపోలో, ఢిల్లీ, (v) ఎయిమ్స్, (vi) లీలావతి, ముంబయి, (vii) జస్లోక్, ముంబయి మరియు (viii) బ్రీచ్ కాండీ, ముంబయి 

     జిఓఎంఎస్. సం. 49, జిఎ(ఎస్.సి-ఇ) శాఖ, తేది 20.03.2018

 

విదేశీ సందర్శనలు


ప్రభుత్వం, విదేశీ సందర్శనలపై జారీచేసిన ఉత్తరువులన్నింటినీ రద్దుచేసి, 17-07-2017 తేదీగల జి.ఓ.ఆర్.టి నెం.1577 లో సమగ్ర ఉత్తరువులు జారీచేసింది. జిఓ.ఆర్ టి సం. 1577, సాధారణ పరిపాలన (ఎస్.సి.-ఇ) శాఖ, తేది 17.07.2017.  

    • ఈ ఉత్తరువులు ప్రభుత్వ అధికారులు మరియు అధికారేతరులు ఉభయులకూ వర్తిస్తాయి.

    • విదేశీ సందర్శనల అనుమతులన్నింటినీ సాధారణ పరిపాలన శాఖ ఇస్తుంది.

    • స్పాన్సర్ చేసే ప్రభుత్వ కార్యదర్శి ద్వారా నమూనా-ఎఫ్ లో దరఖాస్తు సమర్పించాలి.

    • స్పాన్సరింగ్ కార్యదర్శి మొదట ఆర్ధిక శాఖ కార్యదర్శి అనుమతి తీసుకుని అప్పుడు ప్రతిపాదనను సాధారణ పరిపాలన శాఖకు పంపాలి.

 

జీతభత్యాలు


 

వేతనము మరియు భత్యాలు

:

రిలీఫ్ & జాయినింగ్ అందిన మీదట పే స్లిప్ జారీచేయడమవుతుంది.

సిటిసిలు : ఐచ్చికం వినియోగించవలసి ఉంటుంది.

పదోన్నతి

:

పదోన్నతి ఉత్తరువులు అందిన మీదట ఒక నెల లోపల

 

ఎల్ టి సి/టిఎ నియమావళి


సెలవు ప్రయాణ రాయితీ (ఎల్ టి సి) నియమావళి

ఎ.ఐ.ఎస్. (ఎల్.టి.సి.) నియమావళి

బిజినెస్ క్లాసు లో ప్రయాణించుటకు అర్హతగల కుటుంబసభ్యులు

ప్రయాణ భత్యం (టిఎ) నియమావళి

7వ సి.పి.సి.

6వ సి.పి.సి.

 

 

కరవు భత్యం కరవు సహాయం

కరవు భత్యం (డిఎ)

1-1-2014;  1-7-2014

1-1-2015;  1-7-2015

1-1-2016;  1-7-2016

1-1-2017;  1-7-2017

1-1-20181-7-2018

కరవు సహాయం (డిఆర్)

1-1-2014;  1-7-2014

1-1-2015;  1-7-2015

1-1-2016;  1-7-2016

1-1-2017;  1-7-2017

1-1-20181-7-2018

 

పదవిలో చేరడానికి వ్యవధి 


 

సంసిద్ధత కోసం

:

6 రోజులు

ప్రతి 500 కి.మీ. దూరం ప్రయాణానికి

:

1 రోజు

మధ్యలో వచ్చే ప్రభుత్వ సెలవుకు అనుమతి

:

1 రోజు

మొత్తం

:

8 రోజులు

పదవిలో చేరే కాల వ్యవధిలో వినియోగించుకోని భాగం

:

ప్రభుత్వం జారీ చేసిన అనుమతి యోగ్యత మేరకు ఆర్జిత సెలవు ఖాతాకు జమచేయడమవుతుంది.

                                

* పదవిలో చేరడానికి సంబంధించిన కాల వ్యవధిని అవసర సెలవు తప్ప ఏదేని తరహా సెలవు కాలం లేదా సెలవుతో కలపవచ్చు.

 

కార్యవిధుల బదలాయింపు ధృవపత్రం


సెలవు వాడుకోవడానికి ముందు మరియు సెలవు ముగిసిన తరువాత, రిలీఫ్ మరియు జాయినింగ్.

సెలవు / డ్యూటీ వేతనాన్ని అనుమతించేందుకు సెలవు కాలాన్ని క్రమబద్దీకరించడానికి సి.టి.సి. లు అవసరమవుతాయి.

ఛార్జి అప్పగించనట్లయితే, మంజూరు చేసిన సెలవును వినియోగించుకుని, డ్యూటీలో చేరడమయిందన్న మేరకు ఒక లేఖ ఎంఓఎస్ నుండి అవసరమవుతుంది. 

 

 సెలవు పేరు


 

 

 

జమ

 

ఆర్జిత సెలవు

సంవత్సరానికి 30 రోజులు

300 (గరిష్టంగా)

అర్ధ జీతం సెలవు

 

సంవత్సరానికి 20 రోజులు

పరిమితిలేదు

అధ్యయన సెలవు

ఏదైనా ఒకసారికి 12 నెలలు

మొత్తం సర్వీసులో 24 నెలలు

ప్రసూతి సెలవు

180 రోజులు

ఇద్దరు పిల్లల పరిమితికిలోబడి

పితృత్వ సెలవు

15 రోజులు

ఇద్దరు పిల్లల పరిమితికిలోబడి.

శిశు సంరక్షణ సెలవు (సిసిఎల్) : మైనరు పిల్లలు ఉన్న  మహిళా ఉద్యోగులకు ఇద్దరు పిల్లల పరిమితికిలోబడి వారి మొత్తం సర్వీసులో గరిష్టంగా 2 సంవత్సరాల కాలానికి (అంటే 730 రోజులు) సిసిఎల్ మంజూరు చేయవచ్చు. సిసిఎల్ ను ఒక క్యాలెండర్ సంవత్సరంలో 3 దఫాలకు మించి మంజూరుచేయరాదు.

పదివీవిరమణ సమయంలో ఆర్జిత సెలవును నగదుగా మార్చుకోవడం జీతం + డిఎ పై 300 రోజులు ఉంటుంది.

ఆర్జిత సెలవు తక్కువగా ఉన్నట్లయితే (అంటే 300 రోజుల కంటె తక్కువ), కమ్యుటేషన్ లేకుండా 300 రోజుల మొత్తం పరిమితికి లోబడి సెలవును నగదుగా మార్చకోవడానికి అర్ధ జీతం సెలవును పరిగణించడమవుతుంది.

సెలవు ప్రయాణ రాయితీ


    • 4 సంవత్సరాల కొత్త బ్లాక్ కాల వ్యవధి 2018-2021

    • ప్రస్తుత బ్లాక్ కాల వ్యవధి 2018-19.

    • గత బ్లాక్ కాల వ్యవధి 2016-17 (అదనపు కాలావధి 31-12-2018 వరకు)

    • తాజాగా రిక్రూట్ అయిన వారు 4 సంవత్సరాల బ్లాకులో మూడు సందర్భాలలో వారి కుటుంబాలతో వారి స్వస్థలానికి వెళ్ళేందుకు మరియు మొదటి 8 సంవత్సరాల సర్వీసుకు 4 వ సందర్భంలో భారతదేశంలో ఏదేని ప్రదేశానికి వెళ్ళేందుకు అనుమతించడమవుతుంది.

 

 

అర్హత :

 

 

విమాన మార్గం ద్వారా (ఎయిర్ ఇండియా)

బిజినెస్ / క్లబ్ క్లాస్

పిఎంఎల్ 14 అంతకు పై బడిన

 

అతి చౌకైన ఎకానమీ క్లాస్

పిఎంఎల్ 10 అంతకు పై బడిన

రైలు మార్గం ద్వారా

రోడ్డు మార్గం ద్వారా

ఎసి మొదటి తరగతి

పిఎంఎల్ 12 అంతకు పై బడిన

 

ఎసి II టైర్ స్లీపర్

పిఎంఎల్ 10 మరియు 11

రోడ్డు మార్గం ద్వారా

ఏదేని తరహా ప్రజారవాణా ద్వారా అయిన వాస్తవ ప్రయాణ ఖర్చు

పిఎంఎల్ 10 అంతకు పై బడిన

స్థానిక ప్రయాణాలలో చేసిన ఆకస్మిక ఖర్చు తిరిగి చెల్లించబడదు.    

వినియోగించుకున్న సెలవు దినాల సంఖ్య మరియు స్వభావంతో సంబంధంలేకుండా ఒక సందర్భంలో ఆర్జిత సెలవును నగదుగా మార్చుకోవడాన్ని 10 రోజులకు మరియు మొత్తం సర్వీసులో 60 రోజులకు పరిమితం చేయడమయింది. (సిఎం సం. 14028/4/2009- Estt. తేది 3.6.2009)

 

పర్యటన దినసరి భత్యం (రాష్ట్ర నియమావళి)


 

 

 

రాష్ట్రంలో

రాష్ట్రం వెలుపల

వేతన మాత్రిక స్థాయి –II తరువాత నుండి –

గ్రేడ్ –I సీనియర్ వేతన శ్రేణి  ఆపైన

 

450/-

600/-

వేతన మాత్రిక స్థాయి నుండి – 10

గ్రేడ్ – 2 జూనియర్ వేతన శ్రేణి

450/-

600/-

నోటు : జి.ఓ.ఎం.స్.నెం. 150, ఆర్ధిక (హెచ్.ఆర్.vi-టి.ఎఫ్.ఆర్ – ఎ & ఎల్ –టిఎ) శాఖ, తేదీ : 11-12-2015

ప్రయాణ భత్యం (కేంద్ర టిఎ నియమావళి)


1. పర్యటనలో ప్రయాణ భత్యం :

 

    (i) దేశీయ ప్రయాణానికి అర్హత 

 

     రాష్ట్రంలో సేవలందిస్తున్న అఖల భారత సర్వీసు అధికారులు కేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రయాణ భత్యం నియమావళిలో ఏదో ఒక  దానిని ఎంపిక చేసుకోవాలి.

 

పిఎంఎల్

ఆహారం బిల్లు/డిఎ (రోజుకు)

హోటల్ వసతి (రోజుకు)

ప్రయాణ అర్హత

విమానం ద్వారా

రైలు ద్వారా

14 మరియు ఆపైన

రూ, 1200/-

రూ.7500/-

బిజినెస్ క్లాసు/

క్లబ్ క్లాస్

మొదటి తరగతి ఎసి

12 మరియు 13

రూ.1000/-

రూ.4500/-

ఎకానమీ

మొదటి తరగతి ఎసి

10 నుండి 11 వరకు

రూ.900/-

రూ.2250/-

ఎకానమీ

ద్వితీయ తరగతి ఎసి 2 టైర్ స్లీపర్

    (ii) అంతర్జాతీయ ప్రయాణానికి అర్హత

 

పిఎంఎల్

ప్రయాణ అర్హత

17 మరియు ఆపైన

మొదటి తరగతి

14 నుండి 16 వరకు

బిజినెస్ / క్లబ్ క్లాస్

13 మరియు అంత కంటే తక్కువ

ఎకానమీ క్లాస్

నోటు :కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ, వ్యయం శాఖ ఎఫ్.నెం.19030/1/2017 – ఇ.iv.తేదీ : 13-07-2017.

    • విమాన ప్రయాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించే దేశీయ మరియు అంతర్జాతీయ ఉభయ విమాన ప్రయాణాలన్నింటికి సంబంధించి అధికారులు ఎయిర్ ఇండియా ద్వారా మాత్రమే ప్రయాణించవలసియున్నది (ఎస్.ఆర్ 48-బి, కేంద్ర ప్రభుత్వం (14))

    • 09-12-2012 వ తేదీగల సర్క్యులర్ మెమో.నెం.528/04/టిఎ/2012 తో పాటు 31-08-2000 తేదీగల ఆర్ధిక & ప్రణాళిక (ఎఫ్ డప్ల్యు – టిఎ) శాఖ, జి.ఓ.ఎం.ఎస్ నెం.124 మరియు 09-07-13 తేదీగల విదేశీ ప్రయాణ క్లెయింల నిబంధన ఒఎం ప్రకారం విమాన టికెట్లను నేరుగా ఎయిర్ లైన్ బుకింగ్ కౌంటర్లు/వెబ్ సైట్ నుండి లేదా అధీకృత ఎజెంట్లు అంటే (ఎ) మెస్సర్స్ బాల్మెర్ లావ్రీ అండ్ కంపెనీ (బి) మెస్సర్స్ అశోక్ ట్రావెల్స్ అండ్ టూర్స్ (సి) ఐఆర్ సిటిసి (ఎస్.ఆర్ 48-బి, కేంద్ర ప్రభుత్వ) (16) (18) నుండి కొనుగోలు చేయవలసియున్నది.

    • 17-07-17 తేదీగల ప్రభుత్వ సర్క్యులర్ మెమో నెం.1400/ 51 / ఆర్ధిక (హెచ్.ఆర్-vi)/ఎ3 /2017 ప్రకారం, విదేశీ ప్రయాణ క్లెయిం లన్నింటిని కూడ 120 /121- విదేశీ ప్రయాణ ఖర్చులు - సవివరమైన ఖాతా పద్దు క్రింద బుక్ చేయవలసియున్నది.

     

    2. బదిలీ ప్రయాణ భత్యం

     

    దేశం లోపల పర్యటన ప్రయాణ భత్యం 01-07-2017 నుండి వర్తింపజేయబడింది.

    మిశ్రమ బదిలీ గ్రాంటు

     

    అనుమతించదగిన కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం బదిలీ అయిన కార్యస్థానం ఒక దాని నుండి మరొకటి 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న సందర్భంలో చివరి నెల మూలవేతనంలో 80 శాతం.

     

    పూర్వపు కార్యస్థానం నుండి 20 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో మరియు సదరు నగరంలోపల బదిలీ జరిగిన సందర్భంలో, నివాసం మార్పు వాస్తవమైనట్లయితే మిశ్రమ బదిలీ గ్రాంటులో 1/3 వ వంతు.

 

వ్యక్తిగత సామానుల రవాణా :

 

పిఎమ్ఎల్

రైలు/ఓడ ద్వారా

రోడ్డు ద్వారా

12 మరియు ఆపైన

గూడ్సు రైలు / రెండు భాగాలున్న ఒక కంటెయినర్ ద్వారా 6000 కిలో గ్రాములు

కిలో  మీటరుకు రూ.50/-

10 మరియు 11

గూడ్సు రైలు / రెండు భాగాలున్న ఒకేఒక కంటెయినర్ ద్వారా 6000 కిలో గ్రాములు

కిలో  మీటరుకు రూ.50/-

 

ఇంటి అద్దె  భత్యం 


 

నగరం పట్టణం

వర్గీకరణ

ఇంటి అద్దె భత్యం శాతం

ఆంధ్రప్రదేశ్ లో ఏ నగరం లేదు

ఎక్స్

వేతనం పై 24 శాతం

విశాఖపట్టణం/విజయవాడ/గుంటూరు మరియు నెల్లూరు

వై

వేతనం పై 16 శాతం

మిగిలిన ప్రాంతాలు

జడ్

వేతనం పై 8 శాతం

నోటు : (1)  07-07-2017 వ తేదీగల కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ, డి ఓ ఇ నెం 25/2017 – ఇ.ఐహెచ్’బి)

(2) 28-08-2017 వ తేదీగల, సాధారణ పరిపాలన (ఎస్ సిఎ) శాఖ, జి.ఓ.ఆర్ టి నెం. 1903 లోని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తరువుల ప్రకారం, స్థానిక మరియు జిల్లా కార్యలయాలు మినహా సి.ఆర్.డి.ఎ ప్రాంతంలో ఉన్న కార్యాలయాలలో పనిచేస్తున్న అధికారులు 06-06-2018 వరకు 24 శాతం చొప్పున ఇంటి అద్దె భత్యం పొందడానికి అర్హులు.

 

    • అధికారి ప్రభుత్వ/ప్రయివేటు వసతిలో నివసిస్తున్నారా లేదా అనే విషయంలో  ఇంటి అద్దె భత్యం ధ్రువీకరణ తప్పనిసరి.

    • కుటుంబ నియంత్రణ భత్యం మరియు సామాగ్రి నిర్వహణ భత్యాలను రద్దు చేయడమయింది.

    • యూనిఫారమ్ అలవెన్స్ ను డ్రస్ అలవెన్స్ లో కలిపి వేయడమయింది.

    • ఐపిఎస్ అధికారులకు సంబంధించి 01-07-2017 నుండి డ్రస్ అలవెన్స్ సంవత్సరానికి 20,000 గా ఉన్నది. (09-11-2017 వ తేదీగల కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ యు.ఓ.నెం. 45011/01/2011-ఐపిఎస్-హెచ్ తో పాటు 05/12/2017 తేదీగల సాధారణ పరిపాలన (ఎస్.సి.సి) శాఖ, జి.ఎం.ఎన్ క్యూ.288/ఎ1/2017.

    • ఎఫ్.ఆర్ 49 ప్రకారం అదనపు పదవీ భాద్యత భత్యాన్ని జిఎడి మంజూరు చేసింది.

       

బాలల విద్యా భత్యం / హాస్టల్ సబ్సిడీ


    • 1-07-2017 నుండి ప్రారంభమయింది.

    • నర్సరీ నుండి XII వ తరగతి వరకు గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఒక్కో విద్యార్ధికి నెలకు రూ. 2250/- చొప్పున బాలల విద్యా భత్యాన్ని రీఇంబర్స్ చేయడమవుతుంది.

    • ఆయన నియమించబడిన / లేదా నివసిస్తున్న ప్రదేశం నుండి దూరంగా నైవాశసిక పాఠశాల వసతి గృహంలో ఆయన తన పిల్లలను ఉంచినట్లయితే నెలకు రూ.675/- చొప్పున హాస్టల్ సబ్సిడీని రీయింబర్స్ చేసుకోవచ్చును.ఆర్ధిక సంవత్సరం ముగిసిన తరువాత సంవత్సరంలో ఒక సారి రీయింబర్స్ మెంట్ చేసుకోవచ్చును (No A-27021/03/2017“Estt-(AL) Dt16/08/2017 of DOPT).

 

ఫారిన్ సర్వీస్


1. రాష్ట్రం లోపల

  • సెలవు వేతనం రేట్లు/ఆయా ఖాతా పద్దుకు చలానా ద్వారా లేదా విజయవాడలోని  ఇబ్రహీంపట్నం  ఆంధ్రప్రదేశ్ పిఎఓ పేరిట డి.డి/చెక్కు ద్వారా చెల్లించదగు పింఛను విరాళాలు.

   2. ఫారిన్ అసైన్ మెంట్

  • హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ఎజి నిర్వాహించే సెలవు వేతనం / పింఛను విరాళాలు.

  • ఉద్యోగి సర్వీసు మరియు వేతనాన్ని క్రమబద్దీకరించడానికి సెలవు వేతనం మరియు పింఛను విరాళం చెల్లింపు కోసం నిబంధనలు, షరతులు తప్పనిసరి.

   3. డిప్యుటేషన్

 

డిప్యుటేషన్ అలవెన్స్

అదే రాష్ట్రంలోపల

కార్య స్థానంలో మార్పు

అలవెన్స్ రేటు

మూలవేతనంలో 5 శాతం గరిష్టంగా నెలకు రూ.4500/-

మూలవేతనంలో 10 శాతం, గరిష్టంగా నెలకు రూ.9000/-

నోటు : 24-11-2017 తేదీ గదల కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ నెం.ఎ-2/11/2017 – సిబ్బంది విభాగం హెచ్ పే – హెచ్)

    4.కేంద్ర ప్రభుత్వం / ఇంటర్ కేడర్ డిప్యుటేషన్

  •  ఆంధ్రప్రదేశ్ కేడర్ కు సంబంధించిన అఖిల భారత సర్వీసు అధికారుల సర్వీసు రిజిస్టర్ లను పదవీ విరమణ వరకు పిఎఓ నిర్వహిస్తుంది.

  • ఎం.ఓ.ఎస్, కేంద్ర ప్రభుత్వ / ఇంటర్ – కేడర్ డిప్యుటేషన్ పై ఉన్నప్పుడు ఎం.ఓ.ఎస్ / మంత్రిత్వ శాఖ కోరిన మీదట ధృవీకృత సర్వీసు రిజిస్టరు ప్రతిని మంత్రిత్వ శాఖకు పంపడమవుతుంది.

  • డిప్యుటేషన్ ముగిసిన పిదప ఎం.ఓ.ఎస్ సర్వీసు వివరాలు మరియు సెలవు ఖాతాను సర్వీసు రిజిస్టరులో తాజాపరచవలసిన అవసరమున్నది.

 

అప్పులు, అడ్వాన్సులు


1. గృహ నిర్మాణ రుణం

  • రాష్ట్రంలో పని చేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారులు కేంద్రం లేదా ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ రుణం నియమావళిలో ఎదోఒక దానిని ఎంపిక చేసుకోవాలి.

2. నిర్మాణం / కొనుగోలు కోసం

  • కేంద్రం : వేతనానికి 34 రెట్లు లేదా రూ.25 లక్షలు లేదా గృహం ఖరీదు, ఇందులో ఏది తక్కువయితే అది. 8.5 శాతం వడ్డీ రేటు చొప్పున (No.1.17011 /11 /(4)/2016-H-III,GOI Ministry of Housing & Urban affairs, dt 9-11-2017).

  • రాష్ట్రం :         వేతనానికి 50 రెట్లు లేదా రూ.25 లక్షలు ఇందులో ఎది తక్కువయితే అది. 5.6 శాతం వడ్డీరేటు చొప్పున (G.O.Ms.No.130 Fin (HR-VI A&L, TA) Dt: 01/07/2016).(బి) మరమ్మత్తుల కోసంకేంద్రం : గరిష్టంగా రూ. 10 లక్షల రూపాయలకు లోబడి మూల వేతనంపై 34 రెట్లు లేదా విస్తరణ వ్యయం లేదా తిరిగి చెల్లించే సామర్ద్యం.  ఇందులో ఏది తక్కువయితే అది.రాష్ట్రం :  వేతనం పై 20 రెట్లు లేదా రూ.4 లక్షలు. ఇందులో ఏది తక్కువయితే అది.

౩. మోటారు కారు అడ్వాన్స్

  • మూలవేతనం పై 15 రెట్లు / రూ. 6 లక్షలు లేదా వాహన వ్యయం, రాష్ట్ర నియమావళి ప్రకారం ఇందులో ఏది తక్కువ అయితే అది.  (G.O.Ms.No.167 Fin(HR-VI A&L,TA) 20/09/2017).

4. వ్యక్తిగత కంప్యూటర్ రుణం

  • రూ. 50,000/-  లేదా వాస్తవ వ్యయం, రాష్ట్ర నియమావళి ప్రకారం ఇందులో ఏది తక్కువ అయితే అది.  (G.O.Ms.No.167,Fin(HR-VI,A&L,TA) Dt.2Q/09/2017).

 

పదవీ విరమణ


1. పింఛను

  •  పింఛను పేపర్లను ధృవీకరణ సంతకం కోసం ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు సమర్పించవలసి యున్నది. తనిఖీ మరియు పింఛను ప్రయోజనాలను పిఎఓ లెక్కించిన తరువాత, సర్వీసు రిజిస్టర్ తో సహా వాటిని హైదరాబాదులోని అంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ కు పంపడమవుతుంది.

  • పూర్వపు సర్వీసు లెక్కింపును, అర్హత సర్వీసుగా, ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకుంటుంది.

  • ఎం.ఓఎస్ ఒకసారి 20 సంవత్సరాల కనీస అర్హత సర్వీసును అందించిన మీదట, జీతభత్యాలలో 50 శాతం (అంటే చివరిగా పొందిన వేతనం) లేదా చివరి 10 నెలల కాలంలో అందుకున్న సగటు జీతభత్యాలలో ఇందులే ఏది ఎక్కువ ప్రయోజనమో దానిని పింఛనుగా చెల్లించడమవుతుంది.

  • పదవీ విరమణ గ్రాట్వుటీ గరిష్ట పరిమితిని 01-01-2016 నుండి అమలులోకి వచ్చే విధంగా రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచడమయింది.

  • పింఛను కమ్యుటేషన్ 40 శాతం వరకు ఉంటుంది f.No. 38/37/08-P&PW (A), G.O.I. Min. of PPG&P, Dt. 02-09-2008

2. నూతన పింఛను పథకం

  •  కేంద్ర ప్రభుత్వం, ఆర్ధిక మంత్రిత్వ శాఖ వారి ఓ.ఎం.నెం.5/7/2003 ద్వారా వాటా విరాళ పింఛను పథకం ప్రకారం 01-01-2004 న లేదా ఆతరువాత నియామకమయిన అఖిల భారత సర్వీసు అధికారులందరు నిర్ణీత నమూనా (Annexure 1) లో వివరాలను అందించవలసిన అవసరమున్నది.

  • ఎన్ఎఫ్ఎస్ ప్రకారం దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రయోజనం కోసం ఎన్.పి.ఎస్ కి సంబంధించిన కార్య కలాపాలన్నింటికి రాష్ట్ర రాజధానిలో పిఎఓ  రాష్ట్ర నోడల్ అధికారిగా ఉంది.

  • అఖిల భారత సర్వీసు అధికారులు మూలవేతనంలో 10 శాతం + డిఎ ను విరాళంగా అందిస్తారు. సంబంధిత డిటిఒ/పిఎఓలో ప్రతి నెల వారి వేతనాల బిల్లు నుండి వీటిని మినహాయిస్తారు.

 

3. సాధారణ భవిష్య నిధి

  • అఖిల భారత సర్వీసు అధికారుల జిపిఎఫ్ ఖాతాలను ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ నిర్వహిస్తారు.

 

4. సామూహిక బీమా పథకం

       చందా 

  • 1-1-1982 నుండి నెలకు రూ. 80/-, 1-1-1990 నుండి నెలకు రూ.120/-

  • రెగ్యులర్ నియామక అఖిల భారత సర్వీసు అధికారులకు, 1980 బీమా పథకం తప్పనిసరి. రాష్ట్ర బీమా పథకానికి చందా చెల్లించే, అఖిల భారత సర్వీసు అధికారికి నియమించబడిన ఒక రాష్ట్ర అధికారి 1980 సిజిఇ జిఐఎస్ ను గాని లేదా రాష్ట్ర సామూహిక బీమా పథకాన్ని గాని ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాలి. సి.జి.ఇ జి.ఐ.ఎస్ ప్రకారం నమోదు కోసం నిర్ణీత నమూనాలో అనుబంధం-1 లో తన ఐచ్చికాన్ని మరియు ఫారమ్ 8 లో నామినేషన్ ను ఎం.ఓ.ఎస్ 3 సెట్ల లో సాధారణ పరిపాలన శాఖకు సమర్పించవలసి యున్నది.

    చెల్లింపు విధానం

  • ఫారిన్ సర్వీసులో ఉన్నవారికి :      విజయవాడలోని ఇబ్పహీంపట్నం, పిఎఓ పేరిట డిడి ద్వారా లేదా ప్రధాన పద్దు 8658, సస్పెన్స్ అకౌంటు ఎం.హెచ్.123, అఖిలభారత సర్వీసు అధికారులు జిఐఎస్ ఎస్.ఎ.114 కు చలానా ద్వారా

  • ఫారిన్ అసైన్ మెంట్ వారికోసం, విజయవాడలోని ఇబ్పహీంపట్నం, పిఏఓ వారి పేరిట డిడి ద్వారా మాత్రమే.

    వసూలు వివరాలు

  • ఎం.ఎస్.ఓ ల సామూహిక బీమా వివరాలను ఎం.ఓ.ఎస్ ల సర్వీసు రిజిస్టరులో నమోదు చేయడానికి డిడిఓ లు వాటిని పిఏఓ కార్యాలయానికి  పంపే ఏర్పాటు చేస్తారు.

    సామూహిక బీమా పథకం చివరి చెల్లింపు

  • సిజిఇజిఐఎస్ ప్రకారం నమోదు చేసుకున్న అధికారులకు సంబంధించి, పదవీ విరమణ తేదీకి మూడు నెలలు ముందు, మూడు సెట్లలో అనుబంధం-III (ముందుగా అందిన బిల్లు) ను ప్రభుత్వానికి సమర్పించవలసియున్నది. విజయవాడలోని ఇబ్రహీంపట్నం పి.ఎ.ఓ తనిఖీ చేసిన తరువాత వీటిని కేంద్ర ప్రభుత్వానికి పంపడమవుతుంది.

  • నమోదు చేసుకోని సభ్యులకు సంబంధించి, రాష్ట్ర జి.ఐ.ఎస్ నియమావళి ప్రకారం సాధారణ పరిపాలన శాఖ ఆమోదంతో సంబంధిత శాఖ క్లెయింను పరిష్కరించవలసి ఉంటుంది.