Navigation

faqs_default_page

తరచుగా అడిగిన ప్రశ్నలు (ఎఫ్ ఎ క్యు లు)


1)      నేను ఏయే సెలవులకు అర్హత కలిగి ఉన్నాను ?

          (1)    ఆర్జిత సెలవు  -  సంవత్సరానికి 30 రోజులు

          (2)    అర్ధజీతం సెలవు - సంవత్సరానికి 20 రోజులు

          (3)    ప్రసూతి సెలవు - 180 రోజులు, ఇద్దరు పిల్లల వరకు మాత్రమే

          (4)    పితృత్వ సెలవు - 15 రోజులు ఇద్దరు పిల్లల వరకు మాత్రమే

          (5)    పిల్లల సంరక్షణ సెలవు - పూర్తి సర్వీసు కాలంలో గరిష్టంగా 730 రోజులు (ఇద్దరు మైనరు పిల్లలను కలిగి ఉన్న మహిళా అధికారులకు ఒక కాలెండర్ సంవత్సరంలో మూడు విడతలకు మించి మంజూరు చేయరాదు.)

          (6)    స్టడీలీవ్ - పూర్తి సర్వీసు కాలంలో 24 నెలలు – ఒకసారిగా 12 నెలలు.

2)      అవసర సెలవు/ఆర్జిత సెలవు/వైద్య సెలవుకు నేను ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి

  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నేరుగా నివేదించే అధికారులు అంటే ప్రభుత్వ కార్యదర్శులు, కలెక్టర్ & జిల్లామేజిస్ట్రేట్, డిజిపి (హెచ్ ఒ పి ఎఫ్), పిసిసిఎఫ్ (హెచ్ ఒ ఎఫ్ ఎఫ్) లు మంజూరు చేయవలసిన సెలవు కాలము (....నుండి....వరకు), సేలవు స్వభావాన్ని (సిఎల్/ఇఎల్/హెచ్ పిఎల్) తెలుపుతూ తమ సెలవు దరఖాస్తులను నేరుగా ప్రధాన కార్యదర్శికి సమర్పించవలసి యున్నది.

  • ఇతరులు, తమ సెలవు దరఖాస్తులను, తాము నివేదించే అధికారుల ద్వారా సమర్పించవలసి యున్నది.

  • వైద్య సెలవులకు వైద్య ధ్రువపత్రం జతపరచాలి.

  • సెలవు దరఖాస్తులన్నింటినీ ముందుగానే సమర్పించాలి.

3)      విదేశీ ప్రయాణ సెలవు ప్రక్రియ విధానం ఏమిటి ?

  • దేశం, మంజూరుచేయవలసిన సెలవు కాలావధి, స్వభావం, వ్యయాన్ని భరించే ఆదాయ వనరుల వివరాలను తెలుపుతూ తమ విదేశీ ప్రయాణ సెలవు మంజూరు కోసం అధికారులు ధరఖాస్తు చేసుకోవాలి. వ్యయాన్ని భరించే ఆదాయ వనరుల వివరాలను ఈ క్రింది నిర్ణీత నమూనాలో దాఖలు చేయవలసి యున్నది.

         (http://gad.ap.gov.in/personnel/faqs/ex-india-leave-rules-proforma.pdf)

 4)     విదేశీ అధికారిక పర్యటనతో కలిపి విదేశీ ప్రయాణ సెలవును వినియోగించుకోవడానికి అనుమతించదగే కాలం ?

  • విదేశాలలో మొత్తం కాలవ్యవధి 3 వారాలకు మించరాదనే (ప్రయాణ కాలంతో సహా) షరతుపై వాస్తవ విధినిర్వహణ కాలావధిలో 50 శాతానికి మించకుండా (ప్రయాణకాలాన్ని మినహయించి) లేదా 15 రోజులు ఇందులో ఏది తక్కువ అయితే అంతవరకు అధికారిక పర్యటనతో కలిపి సెలవుపై విదేశాలకు వెళ్ళడానికి అఖిల భారత సర్వీసు అధికారులను అనుమతించడమవుతుంది.

  • అధికారిక పర్యటన కాలం 8 రోజుల కంటే తక్కువగా ఉన్న సందర్భంలో 50 శాతం పరిమితిని సడలించి విదేశీ ప్రయాణ సెలవును 4 రోజుల వరకు మంజూరుచేయడమవుతుంది.

5)      అఖిల భారత సర్వీసు అధికారులు ఆర్జిత సెలవును అర్పించి నగదు చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారా ?

  • లేదు. అఖిల భారత సర్వీసు అధికారులు ఆర్జిత సెలవును అర్పించి నగదు చేసుకోవడానికి అర్హులు కారు. అయితే, తమ సెలవు ప్రయాణరాయతీ సందర్భంగా తమ పూర్తి సర్వీసు కాలములో గరిష్టంగా 60 రోజులకు లోబడి వారు 10 రోజులు ఆర్జిత సెలవును అర్పించి నగదు చేసుకోవచ్చును.

 6)    సెలవు ప్రయాణరాయితీకి ప్రస్తుత బ్లాక్ పీరియడ్ ఏమిటి ?

         ఎల్ టి సి సమాచారాన్నిచూడండి.

          (http://gad.ap.gov.in/personnel/faqs/general/#questionLTAdA)

 7)     ప్రస్తుతం వర్తించే టిఎ / డిఎ రేట్లు ఏమిటి ?

          టిఎ/డిఎ సమాచారాన్ని చూడండి.

          (http://gad.ap.gov.in/personnel/faqs/general/#questionLATdA)

8)      పనితీరు మదింపు నివేదికల దాఖలు కోసం తుది గడువు తేదీలు ఏమిటి ?

         పిఎఆర్ నియమావళి ప్రకారం వివిధ స్థాయిల పనితీరు మదింపు నివేదికలు దాఖలు చేయడం కోసం తుది గడువు తేదీలు ఈ క్రింది విధంగా   ఉన్నాయి.

         (http://gad.ap.gov.in/personnel/faqs/pars-cut-off-dates.pdf)

9)      నా ఐపిఆర్ ను ఎప్పుడు, ఎక్కడ దాఖలు చేయాలి ?

          స్థిరాస్థి రిటర్న్ లను (ఐపిఆర్) ఎస్ పి ఎ ఆర్ ఆర్ ఓ డబ్ల్యు ద్వారా ఆన్ లైన్ లో దాఖలు చేయాలి.

          (for IAS: http://sparrow.eoffice.gov.in; for IPS: http://sparrow-ips.eoffice.gov.in; for IFS: http://sparrow-ifs.eoffice.gov.in).

 10)    స్థిరాస్తుల రిటర్న్ లకు తుది గడువు తేది ఏది ?

          డిశెంబరు 31 తో ముగుసే గత సంవత్సరానికి సంబంధించి, ప్రతి సంవత్సరం జనవరి 31.

 11)    నా చరాస్థి రిటర్న్ లను నేను ఎప్పుడు దాఖలు చేయాలి ?

           డిశెంబరు 31 తో ముగిసే గత సంవత్సర కాలానికి సంబంధించి ప్రతి సంవత్సరం జనవరి 31. అయితే, లావాదేవీలు ముగిసిన తరువాత సదరు లావాదేవీని తెలియజేయవలసి ఉన్నది.

 12)    నా ఆర్జిత భాగస్వామి అతడు/ఆమె ఆదాయంతో ఏదైనా ఆస్థిని కొనుగోలు చేసినట్లయితే నేను ప్రభుత్వానికి తెలియజేయాలా ?

          భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడు అతడు/ఆమె  సొంత నిధులతో జరిపిన చరాస్థుల లావాదేవీని నివేదించవలసిన అవసరం లేదు. అయితే, ఇందుకు సంబంధించిన స్థిరాస్థి  లావాదేవీని ప్రత్యేకంగా నివేదించవలసిన అవసరమున్నది.

 13)    అర్హత గల పింఛను సంబంధ ప్రయోజనాలేమిటి ?

          సాధారణ సమాచారం చూడండి

          (http://gad.ap.gov.in/personnel/faqs/general/#retirement