Navigation

functions_default_page

ప్రధాన పరిపాలన శాఖ (జిఏడి) నిర్వహించే విధులను దిగువ వివరించడమయింది :

మంత్రిమండలి


ఈ క్రింది విధులకు మంత్రిమండలి విభాగం బాధ్యత వహిస్తున్నది :

  • ముఖ్యమంత్రిగారి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశాలను నిర్వహించడం.

  • అజెండాను రూపొందించి మంత్రిమండలి సభ్యులకు సర్క్యులేటు చేయడం.

  • మంత్రిమండలి నిర్ణయాల అమలును పర్యవేక్షించడం.

  • క్రింది డాక్యుమెంట్లను సమీక్షిస్తూ, తాజపరచడం.

ఎ)     ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారక నియమావళి.

బి)     సచివాలయ ఆదేశాలు.

సి)     సచివాలయ నిర్వహణ నియమ సంపుటి.

డి)     మంత్రిమండలి చేతి పుస్తకం.

 

సిబ్బంది


 

సిబ్బంది విభాగం క్రింది విధులను నిర్వహిస్తుంది :

  • సిబ్బంది విషయాలలో రాష్ట్ర ప్రభుత్వ మరియు సలహా శాఖలకు సంబంధించిన సిబ్బంది విధానాలను రూపొందించడం.

  • భారతీయ పరిపాలక సర్వీసు, భారతీయ పోలీసు సర్వీసు, భారతీయ అటవీ సర్వీసు కేడర్ల నియంత్రణ.

  • రాష్ట్ర సచివాలయాన్ని నిర్వహించడం కోసం నిపుణులైన సిబ్బందిని నియమించడం మరియు వారి బదిలీలు, పోస్టింగులను నిర్వహించడం.

  • రాష్ట్ర సివిల్ సర్వీసు అధికారుల (డిప్యూటీ కలెక్టర్లు) నియామకాలు, పోస్టింగుల నియంత్రణ.

  • సచివాలయ అతి రహస్య విభాగాన్ని నిర్వహించడం.

  • అన్ని రాష్ట్ర ప్రభుత్వ సీనియరు పరిపాలక పదవులకు నియామకాలు.

  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సర్వీసు (ఏఐఎస్) అధికారులకు శిక్షణ ఇవ్వడం.

  • ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ వ్యవహారాలను నిర్వహించడం.

  • శాసన మండలికి గవర్నరు ప్రసంగాన్ని రూపొదించడం.

 

ప్రోటోకాల్


 

ప్రోటోకాల్ విభాగం క్రింది అంశాలను నిర్వహిస్తున్నది :

  • రాష్ట్రాన్ని సందర్శిస్తున్న అత్యంత ప్రముఖులు, ముఖ్యమైన ప్రముఖుల సందర్శనలు.

  • రాష్ట్ర అతిధి గృహాలు.

  • వేడుకలు.

  • రాష్ట్ర చిహ్నాలు.

  • తాత్కాలిక వసతి, రవాణాను ఏర్పాటు చేయడం.

  • ఈ క్రింది శాఖాధిపతులకు సంబంధించిన అంశాలను నిర్వహించడం :

(i)      ప్రోటోకాల్ మరియు

(ii)     ఆంధ్రప్రదేశ్ భవన్.

 

పొలిటికల్


 

పొలిటికల్ విభాగం క్రింది అంశాలను నిర్వహిస్తున్నది :

  • గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, హైకోర్టు జడ్జీలు, ఛీఫ్ విప్ లకు సంబంధించిన అంశాలు.

  • సెలవు దినాలను ప్రకటించడం.

  • హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ నిఘా కమీషన్ కు సంబంధించిన అంశాలు.

  • రాష్ట్రంలో నిఘా, అవినీతి నిరోధక పరిపాలనను పర్యవేక్షించడం.

  • శాసనమండలి కార్యదర్శి, న్యాయ వ్యవహారాల కార్యదర్శి, విచారణ సంఘాల కమీషనర్లను నియమించడం.

6)      రాష్ట్రీయ భారత మిలటరీ కళాశాల, డెహ్రాడూన్, విదేశీ వ్యవహారాలు మున్నగువంటి వాటికి సంబంధించిన రక్షణదళ పనులు, అవార్డులు, అడ్మిషన్లు వంటి కేంద్ర జాబితా అంశాలు.

7)      నివాసేతర తెలుగు (ఎన్.ఆర్.టి) అంశాలు మరియు విదేశీ కాన్సులేట్లను ఏర్పాటు చేయడం.

8)      రాష్ట్రం జారీ చేసిన ధృవపత్రాలను ధృవీకరించడం.

9)      క్రింది శాఖాధిపతుల వ్యవహారాలను నిర్వహించడం.

(i)      అవినీతి నిరోధక శాఖ.

(ii)     2015, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కోర్టుల చట్టం క్రింద అధీకృత అధికారులు మరియు  ప్రత్యేక కోర్టులు.

(iii)    ఆంధ్రప్రదేశ్ ఎన్.ఆర్.టి. సొసైటీ, మరియు

(iv)    ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక అభివృద్ధి మండలి.

 

శాంతి భద్రతలు


 

శాంతి భద్రతల విభాగంలో క్రింది అంశాలను నిర్వహించడమయింది :

  • శాంతి భద్రతలకు, మతతత్వ మరియు వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన విషయాలు.

  • అంతర్గత భద్రతా విషయాలు.

  • తీవ్రవాద సంఘటనలు, సంరక్షక మరణాలు / సంఘటనలపై విచారణలు.

  • మానవ హక్కుల విషయాలు.

  • ‘సాధారణ శాంతి భద్రతలు’ మరియు ‘పౌర శాంతి’లను నిర్వహించడం.

  • సంబంధిత శాసన వ్యవహారాలన్నింటినీ నిర్వహించడం.

  • అవార్డులు మరియు పతకాలు.

  • ఈ క్రింది స్వయం ప్రతిపత్తిగల సంస్థల వ్యవహారాలను నిర్వహించడం.

(i)      ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం ; మరియు

(ii)     లోకాయుక్త మరియు ఉప-లోకాయుక్త.

 

కార్యాలయ కార్యవిధానం


 

ఈ విభాగంలో ఈ క్రింది అంశాలను నిర్వహించడమయింది :

  • ప్రధాన పరిపాలన శాఖలోని సిబ్బంది మరియు కార్యాలయ నిర్వహణ.

  • స్థలాల కేటాయింపు, సదుపాయ నిర్వహణ మరియు సచివాలయ భవనాలకు సంబంధించిన ప్రవేశ నియంత్రణ.

  • సచివాలయ గ్రంథాలయం మరియు కేంద్ర రికార్డుల శాఖ నిర్వహణ.

  • సచివాలయంలో హాజరు పర్యవేక్షణ.

 

విధాన విభాగం


 

ఈ విభాగంలో ఈ క్రింది అంశాలను నిర్వహించడమయింది :

  • నూతన చర్యలు మరియు ప్రత్యేక ప్రాజెక్టులు.

  • పరిపాలక మరియు రాజకీయ ప్రాముఖ్యత గల అన్ని అంశాలు.

  • రాష్ట్రంలోని బయోమెట్రిక్ హాజరు మరియు ఈ-కార్యాలయ అమలు కోసం నోడల్ అథారిటీకి సంబంధించిన అంశాలు.

 

సేవలు


 

సేవల విభాగం క్రింది విధులను నిర్వహిస్తుంది :

  • సర్వీసు విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం మరియు సలహా శాఖలకు నియామక విధానాన్ని రూపొందించడం.

  • నాన్-కేడర్ శాఖాధిపతులు, 3వ స్థాయి గెజిటెడ్ మరియు ఆ పై స్థాయి పదవుల పదోన్నతి కోసం సమావేశాలు నిర్వహించడం.

  • కారుణ్య నియామక విధానాన్ని రూపొందించడం మరియు సలహా ఇవ్వడం.

  • రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులన్నింటికీ సర్వీసు నియమావళిని రూపొందించడం / సవరించడం మరియు సలహాను ఇవ్వడం.

  • ప్రవర్తన మరియు సంబంధిత విషయాలకు సంబంధించిన నియమావళిని రూపొందించడం / సవరించడం.

  • 1975, రాష్ట్ర పతి ఉత్తరువు అమలును పర్యవేక్షించడం.

  • రాష్ట్ర సచివాలయాన్ని నిర్వహించడం కోసం నిపుణులైన సిబ్బందిని నియమించడం మరియు వారి బదిలీలు, నియామకాలను నిర్వహించడం.

  • ఈ క్రింది వ్యవహారాలను నిర్వహించడం.

(i)      రాజ్యాంగ నియామక ఏజెన్సీ అయినట్టి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్.

                   ప్రభుత్వ ఉద్యోగులందరి కోసం.

          (ii)     క్రమశిక్షణా కార్య వ్యవహారాల ట్రిబ్యునలు.

          (iii)    ఆంధ్రప్రదేశ్ పరిపాలక ట్రిబ్యునలు మరియు

          (iv)    ఆంధ్రప్రదేశ్ సమాచార కమీషను.

 

సింగిల్ యూనిట్


 

ఈ విభాగం ఈ క్రింది కర్తవ్యాలను నిర్వహిస్తుంది :

  • విభాగ అధికారి స్థాయి వరకు సింగిల్ యూనిట్ కు సంబంధించిన సిబ్బంది అందరి వ్యవస్థాపక విషయాలను నిర్వహిస్తుంది.

  • ఉద్యోగుల సంక్షేమాన్ని చూడటం.

  • ప్రభుత్వ పరిపాలనలో సమర్ధత కోసం శాసనసభ సమన్వయ పని, పరిపాలక సంస్కరణలు, ముఖ్యమంత్రి అవార్డులను నిర్వహించడం.

  • అనువాదశాఖ సంచాలకుల కార్యాలయ వ్యవహారాలను నిర్వహించడం.

 

ఎస్టేట్ అధికారి


 

ఈ విభాగాన్ని ఈ క్రింది వ్యవహారాలకు ఉద్దేశించడమయింది :

ప్రధాన కార్యదర్శి నియంత్రణ క్రింద ఉన్న భవనాల నిర్వహణ మరియు కేటాయింపుకు సంబంధించిన విషయాలను నిర్వహించడం.

 

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ


 

ఈ విభాగాన్ని క్రింది విధుల కోసం ఏర్పాటు చేయడమయింది :

గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించిన అన్ని విషయాలను నిర్వహించడం.

 

సమాచారం మరియు పౌర సంబంధాలు


 

ఈ విభాగం క్రింది విధులను నిర్వర్తిస్తుంది :

  • ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడం.

  • మీడియా వ్యక్తులను గుర్తించడం.

  • సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయడం.

  • సినిమా, థియేటర్ మొదలగు వంటి రంగాలలో నంది అవార్డు కార్యక్రమాలను నిర్వహించడం.

  • గౌరవ ముఖ్యమంత్రి, మంత్రులు, మంత్రిమండలి, సచివాలయ శాఖలు, శాఖాధిపతులు మరియు జిల్లా కలెక్టర్లకు సంబంధించిన సమాచారాలను నిర్వహించడం.

  • ఈ క్రింది వ్యవహారాలను నిర్వహించడం :

(i)      సమాచారం మరియు పౌర సంబంధాల సంచాలకుల కార్యాలయం.

(ii)     ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, మరియు

(iii)    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు థియేటర్ల అభివృద్ధి సంస్థ.

 

ప్రధాన ఎన్నికల అధికారి


ఈ విభాగం క్రింది విధులను నిర్వర్తిస్తుంది :

  • రాష్ట్ర శాసనసభ మరియు పార్లమెంటు ఎన్నికలను నిర్వహించడం.

  • ఓటర్ల జాబితాను ప్రచురించడం.