Navigation

vigilance_and_anti_corruption_default_page

అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)


అవినీతి నిరోధక శాఖ అనేది ఒక ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణలు నిర్వహిస్తుంది.e అవినీతి  నిరోధక  చట్టం  క్రింద అట్టి కేసుల దర్యాప్తులు, ప్రాసిక్యూషన్ లను నిర్వహిస్తుంది. ఈ సంస్థ ప్రభుత్వ శాఖలలోని అవినీతి అధికారుల అవినీతి కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను వెలికితీసి, పట్టుకోవడంలో ప్రత్యేక కృషిచేస్తుంది. సంస్థను 1961, జనవరి 2వ తేదీన ఏర్పాటు చేయడమయింది.

 

 అవినీతి నిరోధక శాఖలో ఆరు (6) విభాగాలు ఉన్నాయి :

 (i)  కేంద్ర దర్యాప్తు ఏజన్సీ

(ii)    రహస్య విభాగం

(iii)   పరిపాలన

(iv)   న్యాయ

(v)    ఇంజినీరింగ్

(vi)   పరిశోధన మరియు ప్రణాళిక కేంద్రం

            ఈ సంస్థకు రాష్ట్రంలో 13 జిల్లా కార్యాలయాలు ఉన్నాయి. (కర్నూలు, అనంతపురము, తిరుపతి, కడప, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం మరియు విజయనగరం). సంస్థ ప్రధాన కార్యాలయం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లోని ఎన్ టి ఆర్ పరిపాలన బ్లాకులో ఉంది. సంస్థ కేసులను నమోదుచేసి, అభియోగ పత్రం దాఖలు చేసిన సరళి ఈ క్రింది విధంగా ఉంది :

  

సంవత్సరం

గుర్తించిన కేసులు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు

నేర దుర్వర్తన కేసులు

మొత్తం కేసులు

 

నమోదు చేసినవి

ఛార్జిషీటు దాఖలు చేసినవి

నమోదు చేసినవి

ఛార్జిషీటు దాఖలు చేసినవి

నమోదు చేసినవి

ఛార్జిషీటు దాఖలు చేసినవి

నమోదు చేసినవి

ఛార్జిషీటు దాఖలు చేసినవి

2017

137

142

46

8

16

10

199

160

2016

106

145

51

10

7

6

164

161

2015

141

122

22

7

22

2

185

131

2014

150

94

16

3

9

17

175

114

 

ఎసిబి కోర్టులు

 

ఎసిబి కోర్టులు అవినీతి నిరోధక కేసుల విచారణకు ఉద్ధేశించబడినవి. ఇవి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు మరియు కర్నూలులో పనిచేస్తున్నాయి. ప్రాసిక్యూషన్ కేసులలో నేర నిర్ధారణ ఈ క్రింది విధంగా ఉంది :

 

            సంవత్సరం

నేర నిర్ధారణ శాతం

2017

57.50%

2016

64.51%

2015

75.86%

2014

60.91%

బినామీ ఆస్తిని జప్తు చేయడం


ప్రభుత్వ పదవిని వహిస్తున్న/వహించిన వ్యక్తులు నేర పద్ధతుల ద్వారా ఆస్తిని సంపాదించినట్లు విశ్వసించి న్యాయస్థానంలో విచారణ పెండింగులో ఉండగా, 1988 అవినీతి నిరోధక చట్టం కింద లేదా 1860 భారతీయ శిక్షా స్మృతి క్రింద అట్టి ఆస్తిని జప్తుచేసుకోవడానికి 2016, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కోర్టుల చట్టం ప్రభుత్వానికి వీలు కల్పిస్తున్నది. చట్టం క్రింద ఆస్తుల జప్తుకు సంబంధించిన కేసులను పరిష్కిరించడం కోసం విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు మరియు కర్నూలులో అధీకృత అధికారులను నియమించడమయింది.