Navigation

general_default_page

 దార్శనికత మరియు లక్ష్యం


దార్శనికత

‘ప్రజలే ముందు’ అనే సూత్రంపై ఆధారపడిన అత్యంత సమర్ధవంతమైన, పటిష్టమైన మరియు జవాబు దారీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం.

లక్ష్యం

ఈ క్రింది అంశాల ద్వారా ‘ప్రజలే ముందు’ విధానాలను రూపొందించి, కొనసాగించడం.

 • మంత్రి మండలి నిర్ణాయక రూపకల్పనలో మెరుగుదలలు మరియు మంత్రి మండలి నిర్ణయాలు సకాలంలో అమలు అయ్యేవిధంగా పర్యవేక్షించడం.

 • ప్రభుత్వంలో సీనియర్ మేనేజ్ మెంట్ హోదాలకు సరైన వ్యక్తులను నియమించడం. 

 • ఆంధ్రప్రదేశ్ కేడర్లలో ఇండియన్ అడ్మిన్ స్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీసు సర్వీసు మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు అధికారుల కేడరును నిర్వహించడం.

 • సిబ్బంది శిక్షణ.

 • రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ.

 • రాష్ట్ర ఉద్యోగులపై నిఘా ఉంచడం. 

 • అవినీతి నిరోధక చర్యల ద్వారా పరి పాలనలో న్యాయవర్తనను పెంపొందించడం.

 • సుపరిపాలన కోసం నూతన కార్యక్రమాలు అమలు చేయడం.

 • రాష్ట్రాన్ని సందర్శించే ఉన్నత హోదాగల వ్యక్తుల  వ్యవహారాలు చూడడం. 

   

 

రాష్ట్ర చిహ్నం


జి.ఓ.పి.నెం. 2 , సాధారణ పరిపాలన (పియు.ఏ) శాఖ, తేదీ. 14-11-2018.

 

Multi-Color

Blue

Transparent

     

      logo_official.png

         

     logo_blue_official.png 

        logo_white_official_bg.png
DOWNLOAD
DOWNLOAD
 DOWNLOAD

 

Vector Files   :   DOWNLOAD

Favicon           :  DOWNLOAD

 

రాష్ట్ర చిహ్నలు


జీ.ఓ.ఎమ్ఎస్.నెం.59, ఇ.ఎఫ్.ఎస్ & టి, (విభాగం-II) శాఖ, తేదీ. 30-05-2018

neem tree 6.jpg

 రాష్ట్ర వృక్షం

వేప చెట్టు (నీమ్)

state animal.jpg

రాష్ట్ర జంతువు

కృష్ణ జింక (బ్లాక్ బక్)

 bird.jpg

రాష్ట్ర పక్షి 

రామ చిలుక (రోజ్ రింగడ్ పారాకీట్)

713f4525b865d4436b7ad973a19c875b.jpg

రాష్ట్ర పుష్పం

మల్లెపువ్వు (జాస్మిన్)

 

 

రాష్ట్ర గేయం

       -శంకరంబాడి సుందరాచారి

          -పాడిన వారు శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి 

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

మా కన్నతల్లికి మంగళారతులు,

కడుపులో బంగారు కనుచూపులో కరుణ,

చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.

 

గలగలా గోదారి కదలిపోతుంటేను

బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయీ

మురిపాల ముత్యాలు దొరులుతాయి.

 

అమరావతి నగర అపురూప శిల్పాలు

త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములొ తియ్యందనాలు

నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా

 

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి

తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక

నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం

జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.

Mā telugu talliki mallepūdanḍa,

Mā kannatalliki mangaḷāratulu

Kaḍupulō baṃgāru kanucūpulō karuṇa,

Cirunavvulō sirilu doralinchu mā talli.

 

Galagalā gōdāri kadilipōtunṭênu

Birabirā kr̥ṣṇamma paruguleḍutunṭēnu

Bangāru panṭalē panḍutāī

Muripāla mutyālu doralutāī.

 

Amarāvati nagara apurūpa śilpālu

Tyāgayya gontulō tārādu nādālu

Tikkayya kalamulō tiyyandanālu

Nityamai nikhilamai nilaci vunḍēdāka

 

Rudramma bhujaśakti mallamma pati bhakti

Timmarasu dhīyukti krishnarāyala kīrti

Mā cevulu ringumani mārumrōgēdāka

Nī pāṭalē pāḍutām, nī āṭalē āḍutām

Jai telugu talli, jai telugu talli.

 

వ్యవస్థా స్వరూపం


orgongram_v4_20-09-2018_trl.jpg

వివరణ :       కార్యదర్శి – ప్రభుత్వ కార్యదర్శి (కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/ప్రత్యేక ప్రధాన కార్యదర్శి):

ఎంఎల్ ఓ :   మధ్యస్థాయి అధికారి (ఉపకార్యదర్శి/సంయుక్త కార్యదర్శి/అదనపు కార్యదర్శి/ ప్రత్యేక విధినిర్వాహణ అధికారి) ; సహాయ కార్యదర్శి.

orgongram_v4_05-12-2019_eng.jpg

చరిత్ర


మునపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిఆంధ్రప్రదేశ్  పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014   అనే కేంద్ర చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా విభజించిన మీదట 2014, జూన్ 2వ తేదీన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయింది.